నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Tuesday, January 20, 2009

అసలు సంక్రాంతి

ఆ మధ్య మాకు తెలిసినావిడ బజార్లో కలిస్తే' సంక్రాంతి పనులు పూర్తి అయ్యాయా?ఎప్పుడూ అట్టహాసంగా చేస్తారు కదా!మీ ఆడ బడుచు ఎలా వుందీ?అప్పుడెప్పుడో ఆర్ధికంగా బాగా చితికి పోయారు అన్నారు కదా?' అనడిగాను.
'అదెందుకు అడుగుతారులెండి.ఆ భారమంతా ఇప్పుడు నా నెత్తికొచ్చి పడింది.ఇదిగో వారం ముందే పిల్లా జెల్లా తో వచ్చి నా మీద వాలి పోయారు.మాతో బాటూ సమానంగా అన్నీ సమకూర్చొద్దా?మా వారు దగ్గరుండి మరీ తీసుకొ్చ్చారు.చేసే వాళ్ళకి తెలుస్తుంది ' అంది నిష్టూరంగా.
నిజానికి ఆమెకి డబ్బుకి తక్కువ లేదు.ఆమె ఆడబడుచు ఆమెకి పరాయిదీ కాదు.పని సంగతా?ఇంటి నిండా పని వాళ్ళు.......
'దేనికైనా మనసుండాలి కదా?' అనుకుంటూ ఇంటికొచ్చాను.
సంక్రాంతి రోజు అనుకోకుండా ఆన్ లైన్ లో ఒక అమెరికా స్నేహితురాలితో మాట్లాడాను.'సంక్రాంతి శుభాకాంక్షలు ! ఎలా జరుపుకున్నారు పండుగ ?' అని అడిగాను.
అవీ ఇవీ మాట్లాడుకున్నాక ఆమె ఇలా చెప్పింది.
'ఏముంది?ఒక పేద వృద్దురాలికి కొంత ఆర్దిక సాయం చేసాను.ఇండియా లోని ఒక ధార్మిక సంస్థ కి అయిదువేల రూపాయలు పంపాను.ఈ తృప్తి చాలదా ఈ సంక్రాంతికి ?"అంది .
'అబ్బ ఎంత గొప్ప పండగ! దేనికైనా మనసుండాలి .'అనుకున్నాను మళ్ళీ.

-హేమలత పుట్ల

7 comments:

సుజాత వేల్పూరి said...

హేమలత గారు,
బాగుంది మీ సంక్రాంతి టపా! ఒక మనిషి కన్నీటిచుక్కను తుడవగలిగితే, ఒక ముఖంలో చిరునవ్వు పూయించగలిగితే, అంతకంటే పండగ ఉంటుందా?

Hemalatha said...

సుజాత గారూ! మీరు చెప్పింది నిజం.మీ బ్లాగ్ చూశాను.చాలా బావుకత్వం వుంది మీలో .

Bolloju Baba said...

మీ బ్లాగు బాగుందండీ.

Hemalatha said...

ధన్య వాదాలు బాబా గారూ!

Anonymous said...

hai hemalatha putla garu...ur blog is too good and very informative.i really appreciate ur active part in sahitya acedamy programs.ur poems r also highly subjective!hope to see u soon with a book of ur own.try to come up with an idea,bye dear,take care.

జాన్‌హైడ్ కనుమూరి said...

Today itself I found ur blog
nice of u

Hemalatha said...

జాన్‌ హైడ్ గారూ!బావున్నారా?మీ బ్లాగ్ గురించి ఆంధ్ర జ్యోతి లో అనుకుంటా చూసాను.ఇలా కలవటం ఆనందం గా వుంది.