నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Friday, October 23, 2015

అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్న వక్తలు15. 10.2015 న డా. సి నా రె ఆవిష్కరించిన డా . పుట్ల హేమలత రచన 'అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్నఆచార్య గారపాటి ఉమామహేశ్వర రావు , భాషా శాస్త్ర విభాగం , హైదరాబాద్ 

సెంట్రల్ యూనివర్సిటీ. 

 15. 10.2015 న డా. సి నా రె ఆవిష్కరించిన పుట్ల హేమలత రచన 'అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్న డా. దార్ల వెంకటేశ్వర రావు ,తెలుగు శాఖ , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ15. 10.2015 న డా. సి నా రె ఆవిష్కరించిన పుట్ల  హేమలత  రచన 'అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ  సభలో ప్రసంగిస్తున్న 'కంప్యూటర్ ఎరా ' సంపాదకుడు శ్రీ నల్లమోతు శ్రీధర్ .

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం గ్రంథావిష్కరణ సభ విశేషాలు

డా. దార్ల వెంకటేశ్వరరావు గారి  బ్లాగ్ నుంచి ..... 

http://vrdarla.blogspot.in/2015/10/blog-post_94.html

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం గ్రంథావిష్కరణ సభ విశేషాలు

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు  శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
సభావేదికలో కట్టిన ఆవిష్కరణ బ్యానర్
ఆహ్వాన పత్రం 
ఆవిష్కరణ నాటి గ్రంథ ముఖచిత్రం
స్వాగతం పలుకుతున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు  శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు  శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
సభ ప్రారంభానికి ముందున్న సభలో ప్రేక్షకులు, వక్తల దృశ్యం

గ్రంథాన్ని ఆవిష్కరించిన మాట్లాడుతున్న డా. సి.నారాయణరెడ్డి గారు, పక్కనే ఆసక్తిగా వింటున్న పరిశోధకురాలు డా.పుట్ల హేమలతగారు.


సభలో పాల్గొన్న డా.పుట్ల హేమలత గారి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, ప్రేక్షకులు

సభలో పాల్గొన్న డా.పుట్ల హేమలత గారి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, ప్రేక్షకులు
ప్రసంగిస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు
ప్రేక్షకుల్లో డా. మంజుశ్రీ

ప్రేక్షకుల్లో కవులు జుగాష్ విలీ, డా. రఘు పరిశోధక విద్యార్థులు
తెలంగాణ సారస్వత పరిషత్ ముఖద్వారం, దాని కిందుగా ఆవిష్కరణ వివరాలతో కూడిన బ్యానర్

సభలో పాల్గొన్న కథారచయిత్రులు అద్దేపల్లి జ్యోతి, సమ్మెట ఉమాదేవి. కన్నెగంటి అనసూయ, కవయిత్రి మెర్సి మార్గరెట్ తదితరులు 

రచయిత్రి వలబోజు జ్యోతి, డా. వాసాప్రభావతి  తదితరులు

సభ ప్రారంభానికి ముందు నల్లమోతు శ్రీధర్ గారిచ్చిన పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
భూమిక మాసపత్రిక ఎడిటర్ సత్యవతిగారు తదితరులు 
ప్రముఖ పరిశోధకుడు, అధ్యాపకుడు ఆచార్య బన్న అయిలయ్యగారు, ప్రముఖరచయిత్రులు అరుణగారు, తరిమిశ జానకి తదితరులు
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న రచయిత్రి సమ్మెట ఉమాదేవిగారు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న రచయిత్రి కన్నెగంటి అనసూయగారు 
పరిశోధక విద్యార్థులు సతీస్, ప్రకాశ్ , ఆదినారాయణ, కవి జుగాష్ విలీ తదితరులు 
డా.హేమలతగార్ని ఆలింగనం చేసుకుంటున్న ఒక ఆత్మీయురాలు 
ఆచార్య ఎన్. గోపిగారు ఏదో చెప్తున్న విషయాన్ని ఆసక్తిగా, వినయంగా వింటున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, పక్కనే నల్లమోతు శ్రీధర్ గారు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కవయిత్రి మెర్సి మార్గరెట్, రచయిత్రి తరిమిశ జానకిగార్లు ఉమాదేవిగారు 
రచయిత్రులతో డా. హేమలతగారు 
ప్రసంగాలను ఆసక్తిగా వింటున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగార్లు  
ఆచార్య బి.రాజశేఖర్ గారి కుటుంబసభ్యులతో ఆత్మీయంగా డా.హేమలతగారు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులతో డా. దార్ల, ఆచార్య రాజశేఖర్, డా. హేమలతగార్లు

సభలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావుగారు

సభలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావుగారు

సభ ప్రారంభానికి ముందు సభావేదికపై వక్తలు

సభాధ్యక్షలు ఆచార్య ఎన్.గోపి గారి ప్రసంగ దృశ్యం


రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న రచయిత్రి తరిమిశ జానకిగారు

 డా.అద్దేపల్లి జ్యోతి, సమ్మెట ఉమాదేవి, కన్నెగంటి అనసూయ, డా.మంజుశ్రీ, డా. దార్ల, మెర్సీ మార్గరెట్ గార్లు


(ఫోటోలు: డా.హేమలత గారి సౌజన్యంతో)

Tuesday, March 31, 2015

విహంగ మార్చి 2015 సంచికకి స్వాగతం !

ISSN 2278-4780

 Untitled

సంపాదకీయం – హేమలత పుట్ల

కథలు

అనువాదం-శివలక్ష్మి

కవితలు

వ్యాసాలు


ఆత్మకథలుసినిమా సమీక్షలు

పుస్తక సమీక్షలు

శీర్షికలు

ముఖాముఖి

యాత్రాసాహిత్యం

ధారావాహికలు

అనువాద సాహిత్యం

సాహిత్య సమావేశాలు 

 పత్ర చిత్రకారిణి సుహాసినికి అవార్డుల వెల్లువ
- See more at: http://vihanga.com/#sthash.zS9kesft.dpuf

Thursday, September 19, 2013

అష్టవిధ నాయికలు

అష్టవిధ నాయికలు -1. స్వాధీనపతిక

 "సర్వమునలంకరించుకుని ప్రియుని రాకకై ఎదురుచూసే నాయిక"


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  అష్టవిధ నాయికలు - 2. వాసక సజ్జిక 


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

                                              అష్టవిధ నాయికలు - 3.విరహోత్కంఠిత


                                                విరహోత్కంఠిత
"విరహం వల్ల వేదనపడు నాయిక". 

 ఈమె ప్రియుడు పనికారణంగా ఇంటికి రాలేకపోయినప్పుడు విరహంతో బాధపడుతుంది.

 ఈమెను పానుపుమీద కూర్చున్నట్లు లేదా నిలబడినట్లుగా లేదా 

వరండాలో నిలబడినట్లుగా చూపిస్తారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 అష్టవిధ నాయికలు -4. విప్రలబ్ద 


  విప్రలబ్ద

  "శృంగార నాయిక, సంకేత స్థలానికి ప్రియుడు రానందుకు వ్యాకులపడే నాయిక, మోసగించబడినది". ఈమె రాత్రంతా ప్రియుని కోసం వేచియున్న నాయిక. ఈమెను ప్రియుడు నమ్మించి రానందుకు కోపగించి ఆభరణాలను విసిరిపారేసే వనితగా చిత్రిస్తారు.

  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

   
                                          అష్టవిధ నాయికలు -5. ఖండిత


  ఖండిత

  "ప్రియుడు అన్యస్త్రీని పొందిరాగా క్రుంగునది". నమ్మించిన ప్రియుడు రాత్రంతో వేరొక స్త్రీతో గడిపి మరునాడు వచ్చినందుకు విపరీతమైన కోపంతోవున్న నాయిక.

  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

                                          అష్టవిధ నాయికలు -6. కలహాంతరిత


                                                          కలహాంతరిత

  (Kalahantarita - "one separated by quarrel") or Abhisandhita)

   కోపంతో ప్రియుని వదిలి, తర్వాత బాధపడే స్త్రీ. ఈమె కోపంతో కలహించి లేదా ద్వేషంతో లేదా తనయొక్క చపలత్వంతో ప్రియుని వదిలిన నాయిక. 

   ఈమె ప్రియుడు గృహాన్ని విడిచిపోతున్నట్లుగా తర్వాత నాయిక అందులకు బాధపడుతున్నట్లుగా చిత్రిస్తారు.

  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

   
                          అష్టవిధ నాయికలు -7. ప్రోషితపతిక లేదా ప్రోషిత భర్తృక


                                                              ప్రోషితపతిక

  "ప్రియుడు దేశాంతరం వెళ్ళగా బాధపడే నాయిక". ఈమె భర్త కార్యార్థం దూరదేశాలకు వెళ్లగా సమయానికి రానందుకు చింతిస్తున్న నాయిక.

  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
         

                                           అష్టవిధ నాయికలు -8.అభిసారిక


   

  "ప్రియుడి కోసం సంకేతస్థలానికి పోయే నాయిక". (అభిసారం = ప్రేమికుల సంకేతస్థలం) ఈమె నియమాల్ని అతిక్రమించి ఇల్లు వదలి రహస్యంగా ప్రియుడ్ని కలవడానికి వెళుతున్న నాయిక.

  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

   చిత్రాలు,భాష్యం ,సొగసులు ......ఏర్చి కూర్చింది - మమత రెడ్డి