నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Thursday, September 19, 2013

అష్టవిధ నాయికలు

అష్టవిధ నాయికలు -1. స్వాధీనపతిక

 "సర్వమునలంకరించుకుని ప్రియుని రాకకై ఎదురుచూసే నాయిక"


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  అష్టవిధ నాయికలు - 2. వాసక సజ్జిక 


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

                                              అష్టవిధ నాయికలు - 3.విరహోత్కంఠిత


                                                విరహోత్కంఠిత
"విరహం వల్ల వేదనపడు నాయిక". 

 ఈమె ప్రియుడు పనికారణంగా ఇంటికి రాలేకపోయినప్పుడు విరహంతో బాధపడుతుంది.

 ఈమెను పానుపుమీద కూర్చున్నట్లు లేదా నిలబడినట్లుగా లేదా 

వరండాలో నిలబడినట్లుగా చూపిస్తారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 అష్టవిధ నాయికలు -4. విప్రలబ్ద 


    విప్రలబ్ద

    "శృంగార నాయిక, సంకేత స్థలానికి ప్రియుడు రానందుకు వ్యాకులపడే నాయిక, మోసగించబడినది". ఈమె రాత్రంతా ప్రియుని కోసం వేచియున్న నాయిక. ఈమెను ప్రియుడు నమ్మించి రానందుకు కోపగించి ఆభరణాలను విసిరిపారేసే వనితగా చిత్రిస్తారు.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

     
                                            అష్టవిధ నాయికలు -5. ఖండిత


    ఖండిత

    "ప్రియుడు అన్యస్త్రీని పొందిరాగా క్రుంగునది". నమ్మించిన ప్రియుడు రాత్రంతో వేరొక స్త్రీతో గడిపి మరునాడు వచ్చినందుకు విపరీతమైన కోపంతోవున్న నాయిక.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

                                            అష్టవిధ నాయికలు -6. కలహాంతరిత


                                                            కలహాంతరిత

    (Kalahantarita - "one separated by quarrel") or Abhisandhita)

     కోపంతో ప్రియుని వదిలి, తర్వాత బాధపడే స్త్రీ. ఈమె కోపంతో కలహించి లేదా ద్వేషంతో లేదా తనయొక్క చపలత్వంతో ప్రియుని వదిలిన నాయిక. 

     ఈమె ప్రియుడు గృహాన్ని విడిచిపోతున్నట్లుగా తర్వాత నాయిక అందులకు బాధపడుతున్నట్లుగా చిత్రిస్తారు.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

     
                            అష్టవిధ నాయికలు -7. ప్రోషితపతిక లేదా ప్రోషిత భర్తృక


                                                                ప్రోషితపతిక

    "ప్రియుడు దేశాంతరం వెళ్ళగా బాధపడే నాయిక". ఈమె భర్త కార్యార్థం దూరదేశాలకు వెళ్లగా సమయానికి రానందుకు చింతిస్తున్న నాయిక.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
           

                                             అష్టవిధ నాయికలు -8.అభిసారిక


     

    "ప్రియుడి కోసం సంకేతస్థలానికి పోయే నాయిక". (అభిసారం = ప్రేమికుల సంకేతస్థలం) ఈమె నియమాల్ని అతిక్రమించి ఇల్లు వదలి రహస్యంగా ప్రియుడ్ని కలవడానికి వెళుతున్న నాయిక.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

     చిత్రాలు,భాష్యం ,సొగసులు ......ఏర్చి కూర్చింది - మమత రెడ్డి

    Tuesday, March 26, 2013


    విహంగ మార్చి 2013 సంచికకి స్వాగతం ! 

    ISSN 2278 – 4780v2
    సంపాదకీయం – పుట్ల హేమలత

    కథలు

    ప్రేమను పెంచుకుంటే – స్వాతీ శ్రీపాద
    ఉట్ల స్థంభాల వీధి -పి. రాజ్య లక్ష్మి
    కీరిట ధారిణి – కాదంబరి
    ఉడుం – పూర్ణ చంద్ర తేజస్వి
    అనువాదం: శాఖమూరి రామ గోపాల్

    కవితలు

    మళ్ళీ ఓకొత్త శకం –స్వాతీ శ్రీపాద
    మహిళ అవసరం – లక్ష్మి రాఘవ
    ‘అమ్మా’ ఆలోచించు – బండారు సుజాత
    సాయం కలలు- కె. గీత
    మహిళా విమోచన దినోత్సవం-కె. రాజకుమారి
    వాడితో జాగ్రత్త !! –  మెర్సీ మార్గరెట్
    అగ్ర వాదం – చిన్నారావు కొరమాటి
    ఇప్పుడు వ్రాయండి భారతాన్ని! –
    తుమ్మూరి రాంమోహన్ రావు

    వ్యాసాలు

    ఆదర్శ మాతృమూర్తులు – ఆదూరి హైమావతి
    విక్టోరియారాణి కాలపు మహిళ-గబ్బిట దుర్గాప్రసాద్
    మహిళా మేలుకో – మర్ల సుబ్బ లక్ష్మి
    ‘స్త్రీ చైతన్యం ‘ సాంఘిక ప్రగతి -పద్మ గౌరి

    అమానత్-అవీన్ ల సందర్భంలో -పట్టెం శివ లక్ష్మి
    రిపేరులు – డార్నింగ్- బొట్టా ఉమా రాణి

    ఆత్మకథలు

    నా జీవన యానం లో…మా నాన్నమ్మ – కె.వరలక్ష్మి
    గౌతమీగంగ – కాశీచయనులవెంకటమహాలక్ష్మి

    ముఖాముఖి


    “కవయిత్రి , చిత్రకారిణి” సుహాసినితో –
    డా॥ పుట్ల హేమలత

    శీర్షికలు

    నెలంత పరుగు ( స్వగతం ) – డా. కె.గీత
    నా కళ్లతో అమెరికా-17– డా. కె.గీత
    సమకాలీనం – ప్రతిరోజూ నీదే! విజయభాను కోటే
    ఈ మహిళా దినోత్సవం వరకూ… (చర్చ)-
    విజయ భాను కోటే

    చారిత్రక వ్యాసాలు

    భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
    – సయ్యద్ నశీర్ అహమ్మద్

    ధారావా హికలు

    టగ్ ఆఫ్ వార్ 3 – స్వాతీ శ్రీ పాద
    సుకన్య – విజయ బక్ష్
    స్త్రీ యాత్రికులు – ప్రొ. ఆదినారాయణ
    ఓయినం – జాజుల గౌరి

    ఆరోగ్య దీపిక

    హలో ..డాక్టర్ ! -డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)

    సాహిత్య సమావేశాలు

    జూపాక సుభద్రకు సాహిత్య పురస్కారాలు
    అమెరికాలో కె.గీత “శతాబ్ది వెన్నెల” ఆవిష్కరణ
    “>~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~