నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Friday, November 5, 2010

తెలుగు బ్లాగర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు

4 comments:

రాజ్యలక్ష్మి.N said...

హేమలత పుట్లగారూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

రాకుమార said...

మేడం బాగున్నారా!
రేడియో కవిసమ్మేళనం రోజు, సుందరయ్య భవనం హైదరాబాద్ లో కలిశా.
ఈ మధ్యే మీ బ్లాగు చూశా! చాలా బాగుంది.

Hemalatha said...

బాగున్నాను రాజ్ కుమార్ గారూ ...
అవును రేడియో కవిసమ్మేళనం రోజు, సుందరయ్య భవనం లో కలిశాము. గుర్తుంది.
మీరెలా వున్నారు?

, said...

ilanti ORIGINAL FLAVOUR VUNNA TELUGU KAVITVAM BLOGULLO KANAPADUTUNDANI NAMMALEKUNDA VUNNANU.