అష్టవిధ నాయికలు -1. స్వాధీనపతిక
"సర్వమునలంకరించుకుని ప్రియుని రాకకై ఎదురుచూసే నాయిక"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అష్టవిధ నాయికలు - 2. వాసక సజ్జిక
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
అష్టవిధ నాయికలు - 3.విరహోత్కంఠిత
విరహోత్కంఠిత
"విరహం వల్ల వేదనపడు నాయిక".
ఈమె ప్రియుడు పనికారణంగా ఇంటికి
రాలేకపోయినప్పుడు విరహంతో బాధపడుతుంది.
ఈమెను పానుపుమీద కూర్చున్నట్లు లేదా
నిలబడినట్లుగా లేదా
వరండాలో నిలబడినట్లుగా చూపిస్తారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అష్టవిధ నాయికలు -4. విప్రలబ్ద
విప్రలబ్ద
"శృంగార నాయిక, సంకేత స్థలానికి ప్రియుడు రానందుకు వ్యాకులపడే నాయిక,
మోసగించబడినది". ఈమె రాత్రంతా ప్రియుని కోసం వేచియున్న నాయిక. ఈమెను
ప్రియుడు నమ్మించి రానందుకు కోపగించి ఆభరణాలను విసిరిపారేసే వనితగా
చిత్రిస్తారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అష్టవిధ నాయికలు -5. ఖండిత
ఖండిత
"ప్రియుడు అన్యస్త్రీని పొందిరాగా క్రుంగునది". నమ్మించిన ప్రియుడు
రాత్రంతో వేరొక స్త్రీతో గడిపి మరునాడు వచ్చినందుకు విపరీతమైన కోపంతోవున్న
నాయిక.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అష్టవిధ నాయికలు -6. కలహాంతరిత
కలహాంతరిత
(Kalahantarita - "one separated by quarrel") or Abhisandhita)
కోపంతో ప్రియుని వదిలి, తర్వాత బాధపడే స్త్రీ. ఈమె కోపంతో కలహించి లేదా
ద్వేషంతో లేదా తనయొక్క చపలత్వంతో ప్రియుని వదిలిన నాయిక.
ఈమె ప్రియుడు
గృహాన్ని విడిచిపోతున్నట్లుగా తర్వాత నాయిక అందులకు బాధపడుతున్నట్లుగా
చిత్రిస్తారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అష్టవిధ నాయికలు -7. ప్రోషితపతిక లేదా ప్రోషిత భర్తృక
ప్రోషితపతిక
"ప్రియుడు దేశాంతరం వెళ్ళగా బాధపడే నాయిక". ఈమె భర్త కార్యార్థం దూరదేశాలకు వెళ్లగా సమయానికి రానందుకు చింతిస్తున్న నాయిక.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అష్టవిధ నాయికలు -8.అభిసారిక
"ప్రియుడి కోసం సంకేతస్థలానికి పోయే నాయిక". (అభిసారం = ప్రేమికుల
సంకేతస్థలం) ఈమె నియమాల్ని అతిక్రమించి ఇల్లు వదలి రహస్యంగా ప్రియుడ్ని
కలవడానికి వెళుతున్న నాయిక.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
చిత్రాలు,భాష్యం ,సొగసులు ......ఏర్చి కూర్చింది - మమత రెడ్డి
0 comments:
Post a Comment