నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Thursday, December 11, 2008

సాహిత్య అకాదెమి,బెంగళూరు,మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడెమీ, 8-10డిసెంబరు2008,రాజమండ్రి.


  
 సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానం-హేమలత పుట్ల(పక్కన ప్రముఖ నవలా రచయిత  శ్రీ అంపశయ్య నవీన్)
              

 'ఖాళీ సీసాలు 'కథా రచయిత,కవి స్మైల్ మృతికి ...సంతాపం...



రచయితలు-ఆచార్యఎండ్లూరిసుధాకర్,అక్కిరాజురమాపతిరావు,ముఖ్యఅతిథి ఆచార్యనిరూపరాణి(న.వి.వి)వి.సి,అంపశయ్య నవీన్.



                    విశిష్ఠ అతిథి..పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం,సాహిత్యపీఠాధిపతి
                                               ఆచార్య.ఎండ్లూరి సుధాకర్


                                         ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ ప్రసంగం.


                                    కవి శ్రీ సరికొండ నరసింహ రావు  కవితాగానం


 ప్రముఖ రచయితలు..డా.కె.ఎన్.మల్లీశ్వరి,పాతూరి అన్నపూర్ణ, సన్నిధానం నరసింహ శర్మ,
                                 డా.ఎండ్లూరి, డా.B.జయరావు.


                              ప్రముఖ కవి డా.పరిమళ్ కవిత్వ పఠనం




కవులు...పరిమళ్,జయరావు,నామాడిశ్రీధర్,సన్నిధానంనరసింహశర్మ,ఎండ్లూరి సుధాకర్ .



ప్రముఖరచయితలు డా.ఎల్.కె సుధాకర్,డా.కె.ఎన్.మల్లీశ్వరి,పాతూరిఅన్నపూర్ణ,సన్నిదానం,
                                      డా. ఎండ్లూరి,డా.దార్ల రవికుమార్. 



                                        
                                      మనోరంజన కార్యక్రమం -శివాజిR.J   93.5 RedF.M





        కవి సమ్మేళనం .. పుట్ల హేమలత, కథా రచయిత్రి k .వరలక్ష్మి ఆధ్వర్యం లో...




మైనారిటీ సాహిత్య పరిచయం ..డా,ఎస్వీ సత్యనారాయణ,డా.దార్ల, స్కై బాబా,పుట్ల హేమలత








                                             శ్రీమతి.జక్కంపూడి విజయ లక్ష్మి




    సభాధ్యక్షులు డా//దార్ల వెంకటేశ్వర రావు,ప్రొఫెసర్,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్






                 ఈసభలోడా.సీతారాం మైనారిటీ వాదంలో 'అభివ్యక్తి ,రీతులు' అంశం మీద విశ్లేషించారు.


                                            

                                         






 డా.సీతారాం .డా.యస్వీ, డా.దార్ల. స్కై బాబా.



 వేదికపై డా.షమియుల్లా,శ్రీఅంపశయ్య నవీన్,శ్రీ కోడూరిశ్రీరామ్మూర్తి,శ్రీ ఇళంగోవన్,డా.మధురాంతకం నరేంద్ర .
                    సభాధ్యక్షులు డా//దార్ల వెంకటేశ్వర రావు,ప్రొఫెసర్,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
                


                 ప్రముఖ మైనార్టీ కవి,రచయిత  శ్రీ  స్కై బాబా ప్రసంగం మైనారిటీ వర్గాల దేశీయతని ప్రశ్నించింది .





  మైనారిటీ సాహిత్యసభకి ముఖ్యఅతిథి డా.యస్వీ.సత్యనారాయణ,అధ్యక్షులు  డా.దార్లవెంకటేశ్వరరావు,వక్తలుగా
ప్రముఖ కవులు  డా.ఆర్.సీతారాం, స్కై బాబా.


ప్రముఖ రచయిత్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్,వేమన విశ్వ విద్యాలయం ... డా//యం.యం.వినోదిని  మైనారిటీ స్త్రీవాదాన్ని ఆలోచనాత్మకంగా వివరించింది.



ప్రముఖ కవి డా.శిఖామణి,రచయిత అంపశయ్య నవీన్,ప్రముఖ విమర్శకులు కోడూరి శ్రీరామ్మూర్తి,శ్రీ ఇళంగోవన్,రీజనల్ సెక్రెటరి,సాహిత్య అకాదెమి దక్షిణ ప్రాంతీయ కార్యాలయం,బెంగళూరు,ప్రముఖరచయిత మధురాంతకంనరేంద్ర,పుట్లహేమలత,వక్త డా//షమియుల్లా .



               రచయిత్రులు-డా.మల్లీశ్వరి.కె.ఎన్,పాతూరి అన్నపూర్ణ,పుట్ల హేమలత,డా.యం.యం.వినోదిని.

                                          ప్రముఖ కవులు,రచయితలూ...





  shamiyulla,ampasayya naveen,sikhamani,koduri sri rama murthy,ilangovan(sahitya academy  regional sec)madhurantakam narendra. hemalatha putla

                            dr.s.v satyanarayana,dr.chaitanya sekhar,sri.suryavamsi




                                                        సాహితీ విందు ...........












సభల్లో ప్రదర్శించబడ్డ జానపద కళా రూపాలు ;చెక్క బొమ్మలాట(లవకుశ ),చిందు యక్షగానం (కీచక వధ ).ఈ కళలు దాదాపుగా అంతరించే దశలో వున్నాయి.


'చిందు యక్షగానం' గజవెల్లి ఏసోబు బృందం ,'చెక్క బొమ్మలాట' మోతె రామస్వామి బృందం (వరంగల్)వారు ప్రదర్శించారు.



శ్రీ ఇళంగోవన్,రీజనల్ సెక్రెటరి,సాహిత్య అకాదెమి దక్షిణ ప్రాంతీయ కార్యాలయం ,బెంగళూరు
పుట్ల హేమలత,వ్యవస్థాపక అధ్యక్షురాలు,మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడెమీ,రాజమండ్రి .


సభలకు విచ్చేసిన వక్తలకు ,రచయితలకు ,కవులకు , అతిథులకు,సాహితీ ప్రియులకి.......ముఖ్యంగా స్నేహశీలి 'మీనలోచని' గారికి.....అందరికీ వందనాలు!


Wednesday, December 10, 2008

'మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ ' కార్యక్రమాలు


contd ..